Siddharth Roy Review: అర్జున్ రెడ్డి రేంజ్లో ఉందా?
టీజర్, ట్రైలర్ చూసిన ప్రేక్షకులు అర్జున్ రెడ్డి సినిమాను ఊహించుకున్నారు. అంతలా హైప్ క్రియేట్ చేసింది ఈ సినిమా. మరీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
చిత్రం: సిద్దార్థ్ రాయ్ నటీనటులు: దీపక్ సరోజ్, తన్వి నేగి, మ్యాథ్యూ వర్గీస్, కళ్యాణి ఎన్, ఆనంద్ తదితరులు దర్శకత్వం: వి యశస్వి నిర్మాత: జయ ఆడపాక మ్యాజిక్: రదన్ సినిమాటోగ్రాఫర్: శ్యామ్ కె నాయుడు విడుదల: 23/02/2024
కథ:
సిద్దార్థ్ ఒక రిచ్ ఫ్యామిలీ పుట్టిన బార్న్ జీనియస్. ప్రతీది సైన్స్ అండ్ లాజిక్స్‌తో ముడిపడి ఉంటుంది అని బలంగా నమ్మే మనస్థత్వం ఏర్పరుచుకుంటాడు. ఈ క్రమంలో ఎమోషన్స్ అంటే ఏంటో తెలియకుండా పెరుగుతాడు. అలాంటి సిద్దార్థ్ లైఫ్‌లో ఇందు అనే అమ్మాయి వస్తుంది. సిద్దు చదివే కాలేజీలో చేరుతుంది. మొదట అతని ప్రవర్తన, తెలివి చూసి అట్రాక్ట్ అవుతుంది. పూర్తిగా అతని గురించి తెలుసుకొని చదువుపై కాన్సట్రేషన్ చేస్తుంది. ఈ క్రమంలో కాలేజీలో ఒక కాంపిటీషన్లో సిద్దును బీట్ చేస్తుంది హిందు. దాంతో సిద్దార్థ్ ఈగో ఫీల్ అవుతాడు. ఈగో కూడా ఒక రకమైన ఫీలింగ్ అని చెప్పడంతో.. సిద్దార్థలో మార్పు మొదలౌతుంది. తరువాత ఇందుతో ప్రేమలో పడుతాడు. ఎమోషన్స్ ఫీల్ అవుతాడు కానీ అవి కూడా తీవ్రస్థాయిలో ఉంటాయి. అతని ప్రవర్తన పట్ల చుట్టు ఉన్నవారు ఇబ్బందులు పడుతారు. ఇందు కూడా తనను బరించలేక విడిచి వెళ్లిపోతుంది. సిద్దార్థ్ ఎందుకలా పెరిగాడు, అతని మార్పుకు కారణం ఏంటి? ఇందు గోల్ ఏంటి? వారిద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, మళ్లీ కలిశారా? సిద్దు మారాడా లేదా అనేది తెలియాలంటే సిల్వర్ స్క్రీన్‌లో చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
సిద్దార్థ్ హీరోయిన్ తన హాస్టల్ కు వెళ్లంతో కథ మొదలు అవుతుంది. అంటే గతంలో వీరి ఏం జరిగిందో అనే ఆసక్తితో కథను మొదలుపెట్టిన తీరు బాగుంది. ఇందు కాలేజీలో చేరి సిద్దార్థ్ గురించి తెలుసుకోవాలని అనుకోవడంతో సిద్దార్థ్ క్యారెక్టరైజేషన్ మొదలౌతుంది. చాలా సీన్లు ప్రేక్షకుడిని అలరిస్తాయి. సిద్దు అలా మారడానికి ఎంచుకున్న నేపథ్యం సరియైనదే అని పిస్తుంది. తిండి, నిద్ర, సెక్స్ ఈ మూడే మనిషికి సాధారణంగా అవసరం అని నమ్మే సిద్దార్థ్, ఆకలేస్తే ఆకులైనా తింటాడు, నిద్రొస్తే రోడ్డుపక్కనే పడుకుంటాడు. ఫీలింగ్స్ వస్తే పనిమనిషి అయినా ఓకే అంటాడు. ప్రథమార్థం అంతా ఇంతే. తనకంటే హిందు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం, తనముందే అందరు తనను పొగడడంతో మార్పు మొదలౌతుంది. ఇంటర్ మిషన్‌లో తనలో చేంజ్ వచ్చే సీన్ బాగుంది. ఇక సెకండ్ ఆఫ్‌లో కొత్త సిద్దార్థ్ కనిపిస్తాడు. అంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయి కానీ ప్రతీది ఎక్స్ట్రీమ్గా చేస్తాడు. ఇదే క్రమంలో హీరోయిన్‌తో ప్రేమలో పడుతాడు. వారి మధ్య రోమాన్స్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇలాంటి మనిషితో ఎలారా బాబు వేగేది అనే ఫీలింగ్ వస్తుంది. కొన్ని సీన్లు అయితే కాస్త చిరాకు కూడా తెప్పిస్తాయి. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి సిద్దూ తీరు పరాకాష్టకు చేరుతుంది. ఎవరు ఏమి చేయాలేని పరిస్థితి. కానీ సినిమా అయిపోయిన తరువాత కాస్త డిస్టర్బ్ చేస్తుంది.
ఎవరెలా చేశారు:
సిద్దార్థ్ క్యారెక్టర్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ యాక్టింగ్ బాగున్నప్పటికీ గెడ్డంతో ఉన్న లుక్ అంతా సెట్ అవలేదు. ఎమోషన్స్ చాలా బాగా పండించాడు. ఫస్ట్ హాప్ లో ఎలాంటి భావాలు కనపించకుండా చేయడం సెకండ్ ఆఫ్ లో ప్రతీ ఎమోషన్స్‌ను ఎక్స్ట్రీమ్గా చేయడం బాగుంది. కొన్ని చోట్ల యాక్టింగ్ నార్మల్‌గా అనిపించింది. హీరోయిన్ తన్వి నేగి కొత్త అమ్మాయి యాక్టింగ్ కొన్ని చోట్ల ఓకే అనిపించింది. కానీ చాలా చోట్ల ఫ్లాట్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఇంకా మెరుగు పడాలి. అలాగే మ్యాథ్యూ నర్గీస్ యాక్టింగ్ బాగుంది. తండ్రిగా చేసిన ఆనంద్ తదిరలు వారి పాత్రల మేరకు మెప్పించారు.
సంకేతిక అంశాలు:
డైరెక్టర్ యశస్వీ కొన్ని చోట్ల తడబడ్డాడు అనిపించింది. కథలో చెప్పే ఎమోషన్స్ చూపించే హాడవిడిలో కథ ప్రేక్షకుడిని ఏ మేరకు ఎంగేజ్ చేస్తుందన్నది మరిచిపోయినట్లు అనిపించింది. తాను చెప్పాలను కున్నది నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ పూర్తిగా రియలిస్టిక్‌గా తెరకెక్కించలేకపోయారు. అలాగే డైలాగ్స్ కూడా చూసుకోవాల్సింది. చాలా వరకు ఇంగ్లీష్‌లో పెట్టడం అది ఫిలాసఫీ డైలాగ్స్ వాడడం ప్రేక్షకుడిని డిస్ కనెక్ట్ చేస్తాయి. ఇక సినిమాటోగ్రఫి కొన్ని చోట్ల ఓకే, మ్యాజిక్ అంతగా ఎక్కలేదు. ఎడిటింగ్ కూడా పెద్దగా ఎఫెకక్టీవ్గా లేదు. నిర్మాణ విలువలు ఓకే అనిపిస్తాయి.