»Naga Chaitanya Samantha First Time Samantha Naga Chaitanya On The Same Stage
Naga chaitanya-Samantha: ఫస్ట్ టైం.. ఒకే వేదిక పై సమంత, నాగ చైతన్య!
విడాకుల తర్వాత నాగ చైతన్య, సమంత ఎదురు పడ్డ సందర్భాలు లేవు కదా.. కనీసం ఇద్దరు ఒకే వేదికను పంచుకున్నది కూడా లేదు. కానీ లేటెస్ట్గా ఇద్దరు ఒకే వేదికను పంచుకున్నారు. మరి సామ్, చైతన్య ఎదురుపడ్డారా?
Naga chaitanya-Samantha: అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. ఈపాటికే నాగ చైతన్య, సమంత తల్లిదండ్రులు అయి ఉండేవారు. కానీ అలా జరగలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్, చై ఇద్దరు కొన్నాళ్లకే విడిపోయారు. కారణాలు ఏమైనా.. ఈ విషయంలో అటు సమంత ఫ్యాన్స్, అక్కినేని అభిమానులు చాలా బాధపడ్డారు. ఇక డివోర్స్ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు ఇద్దరు. కాకపోతే సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేజ్ చేస్తోంది. ఈ మధ్యే తిరిగి సినిమాలు చేయడానికి రెడీ అయింది. నాగ చైతన్య మంచి హిట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. అయితే.. విడాకుల తర్వాత ఈ ఇద్దరు ఎప్పుడైనా ఎదరు పడ్డారా? కలిశారా? అనేదే నెటిజన్స్ డౌట్.
అప్పుడెప్పుడే షూటింగ్ స్పాట్లో ఇద్దరు ఉన్నారని.. అది తెలిసి ఒకరు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం ఇద్దరు ఒకే వేదికను పంచుకున్నారు. విడాకుల తర్వాత ఫస్ట్ టైం సామ్, చై పంచుకున్న వేదికగా అమెజాన్ ఈవెంట్ నిలిచింది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ ముంబై వేదికగా ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించింది. ప్రైమ్ ఒరిజినల్స్ ప్రాజెక్ట్స్‌లో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
ప్రముక బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఈ ఈవెంట్‌కి హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి చైతన్య, సమంత ఇద్దరు కూడా అటెండ్ అయ్యారు. ఇప్పటికే అమెజాన్ కోసం ధూత వెబ్ సిరీస్ చేశాడు నాగ చైతన్య. సమంత సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇలా సమంత-నాగ చైతన్య ప్రైమ్ ప్రమోషనల్ ఈవెంట్లో భాగం అయ్యారు. కానీ.. వీరిద్దరూ ఒకేసారి ఈవెంట్‌కు రాలేదు. అందుకే ఇద్దరు ఎదురు పడే ఛాన్స్ లేదు. ఉంటే.. ఈపాటికే సోషల్ మీడియా షేక్ అయిపోయేది.