సూపర్ స్టార్ మహేష్ బాబు మేనకోడలు, మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్ సినిమాల్లోకి రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఆమె ‘మనసుకు నచ్చింది’ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. కాగా, సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేందుకు జాన్వీ.. నటన, డ్యాన్స్ వంటి వాటిలో ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.