సత్యసాయి: జిల్లాలోని 21 మండలాల్లో వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. అత్యధికంగా నంబులపూలకుంట మండలంలో 13.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తలుపుల, గాండ్లపెంట, తనకల్ మండలాల్లో 7 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడింది. జిల్లాలో మొత్తం 74.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సగటు వర్షపాతం 2.3 మిల్లీమీటర్లు నమోదైంది.