ప్రకాశం: కనిగిరి మండలంలోని గొల్లపల్లి చెరువును బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగాది సింహారెడ్డి పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో చెరువు పూర్తిస్థాయిలో నుండి అలుగు పారుతుంది. దీంతో కనిగిరి నుండి వెలిగండ్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరదనీరు ప్రవాహం తగ్గేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనాలు రాకుండా గేట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.