KMM: మొంథా తుఫాన్ తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ బుధవారం సూచించారు. ఎటువంటి ప్రాణ నష్టం & ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. విద్యుత్, త్రాగునీరు, అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.