SKLM: తుఫాన్ ప్రభావంతో ఎల్.ఎన్.మండలంలోని దబ్బపాడు, తురకపేట, కృష్ణాపురం, వాడవలస, లక్ష్మీనర్సుపేట, బొర్రంపేట తదితర గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. సుమారు 500 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని స్థానిక రైతులు వాపోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టాలని బుధవారం స్థానిక రైతులు కోరుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నారు.