»Pneumonia Spread In China Karnataka Health Department Orders To The People And Hospitals
Chinaలో న్యుమోనియా వ్యాప్తి..కర్ణాటక ప్రజలకు ఆదేశాలు
చైనాలో న్యుమోనియా(Pneumonia) వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక(karnataka) ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రజలకు పలు ఆరోగ్య సూచనలు చేసింది. ఇప్పటికే ఈ అంశంపై కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
Pneumonia spread in China karnataka health department orders to the people and hospitals
చైనాలో చిన్నారుల్లో శ్వాసకోశ వ్యాధులు(Pneumonia) పెరుగుతున్నాయన్న నివేదికల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వ ఆరోగ్య శాఖ(karnataka health department) అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సీజనల్ ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ఆరోగ్య శాఖ పౌరులకు సలహా జారీ చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఆసుపత్రి సంసిద్ధత చర్యలను తక్షణమే సమీక్షించాలని కోరుతూ ఇటివల కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఈ మేరకు ప్రకటించారు.
Considering the surge in respiratory illness in China, WHO has released a general advisory for people. I request the public to follow the instructions, know the Dos and Don’ts and take measures to prevent influenza.
ఆరోగ్య శాఖ సలహా ప్రకారం సీజనల్ ఫ్లూ వైరస్ అనేది ప్రస్తుతం చైనా(china)లో ఎక్కువగా ఆందోళన కలిగిస్తుంది. ఈ వ్యాధి ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఉండే అంటు వ్యాధి. ఇది శిశువులకు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా ప్రమాదం కలిగిస్తుంది. వీరికి ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్చాలి. నవంబర్ 26న చైనా న్యుమోనియా ఆందోళనల నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు ఆసుపత్రుల్లో చర్యలను సమీక్షించాలని కోరింది. ఉత్తర చైనాలోని పిల్లలలో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయని ఇటీవలి నివేదికల దృష్ట్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ప్రకటన వచ్చింది.
ఈ వ్యాధి లక్షణాలలో(symptoms of pneumonia) ప్రధానంగా జ్వరం, చలి, ఆకలి లేకపోవటం, వికారం, తుమ్ములు, పొడి దగ్గు వంటివి ఉంటాయి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం, తరచుగా చేతులు కడుక్కోవడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు. మీ కళ్ళు, ముక్కు లేదా నోటిని అనవసరంగా తాకడం మానుకోండి. తగినంతగా నిద్రపోండి, శారీరకంగా చురుకుగా ఉండండి, ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోండి. పుష్కలంగా నీరు త్రాగండి, పౌష్టికాహారం తినండి. బహిరంగంగా ఉమ్మివేయడం మానుకోండి. దీంతోపాటు రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రజలు ఫేస్ మాస్క్‌లను ఉపయోగించాలని సూచించారు.