»First Ever Transatlantic Flight Fuelled By Cooking Oil Takes Off
Cooking Oilతో టేకాఫ్ అయిన విమానం
వంట నూనె, ఇతర ఇంధన మిశ్రమంతో బోయింగ్ ఫ్లైట్ నడిపించి చరిత్ర సృష్టించింది వర్జిన్ అట్లాంటిక్ ఏవియేషన్ సంస్థ. హిత్రో నుంచి న్యూయార్క్‌కు మంగళవారం ఆ విమానం బయల్దేరింది.
First-Ever Transatlantic Flight Fuelled By Cooking Oil Takes Off
Cooking Oil: వాహనం నడవాలంటే ఇంధనం కావాలి. బైక్స్, కార్లు, బస్సుల్లో అయితే పెట్రోల్, డీజిల్ వాడతారు. విమానంలో కూడా ఇంధనం (fuel) వాడతారు. అది పెట్రోల్, డీజిల్ కన్నా నాణ్యమైంది.. కాస్ట్లీ కూడా.. అందుకే విమాన ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇక విషయానికి వస్తే.. వంట నూనె పోసి ఓ విమానాన్ని టేకాఫ్ చేశారు. వంటనూనెతో పాటు ఇతర ఇంధన మిశ్రమం కలిపి విమానాన్ని గాల్లోకి ఎగిరించారు.
హీత్రో నుంచి న్యూయార్క్‌కు అట్లాంటిక్ బోయింగ్ 787 విమానం మంగళవారం 12 గంటలకు బయల్దేరింది. ఇందులో స్వచ్ఛమైన వంటనూనె పోశారు. అందులో వర్జిన్ అట్లాంటిక్ వ్యవస్థాపకులు సర్ రిచర్డ్ బ్రాన్సన్, ట్రాన్స్ పోర్ట్ సెక్రటరీ మార్క్ హర్పర్ ఉన్నారు. ఇది ప్రయోగాత్మక చాపర్ అయినందున ప్రయాణికులను అనుమతించలేదు. జెట్ ఇంధనంలో మ్యాగ్జిమమ్ 50 శాతం వరకు కిరోసిన్‌తో మిళితం చేసిన ఆయిల్ వాడతారు.
History at 38,000ft. Virgin Atlantic is currently flying the world's first 100% Sustainable Aviation Fuel flight across the Atlantic by a commercial airline. Flight100 marks the culmination of more than a year of radical cross industry collaboration to see this take to the skies. pic.twitter.com/97mLaa4hoj
విమానం ఎగిరే వీడియోను వర్జిన్ అట్లాంటిక్ పోస్ట్ చేసింది. ఆ విమానం 38 వేల అడుగులో ఎత్తులో ప్రయాణించింది. ప్రపంచంలో తొలి 100 శాతం సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఫ్లైట్‌ను అట్లాంటిక్ మీదుగా ట్రావెల్ చేసింది. 2050 ఏడాది నాటికి ప్రపంచంలో పరిస్థితులు మరింత దిగజారుతాయి. ఇంధనం వినియోగం ద్వారా పర్యావరణంపై పెను ప్రభావం చూపుతాయి. ఇలా వంటనూనె, ఇతర ఇంధనాలు మిళితం చేసి ప్రయాణించే ఆవిష్కరణలు మేలు చేస్తాయని బ్రిటన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.