Jeet Adani gets engaged to Diva Jaimin Shah:ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ (gautham adani) ఇంటిలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన రెండో కుమారుడు జీత్ అదానీ (Jeet Adani) ఓ ఇంటివాడు కాబోతున్నారు. దియ జైమిన్ షాతో (Diva Jaimin Shah) ఆదివారం అహ్మదాబాద్లో జీత్ అదానీకి (jeet adani) అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది.
Jeet Adani gets engaged to Diva Jaimin Shah:ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ (gautham adani) ఇంటిలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన రెండో కుమారుడు జీత్ అదానీ (Jeet Adani) ఓ ఇంటివాడు కాబోతున్నారు. దియ జైమిన్ షాతో (Diva Jaimin Shah) ఆదివారం అహ్మదాబాద్లో జీత్ అదానీకి (jeet adani) అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. దియ తండ్రి జైమిన్ షా (jaimin shah).. ప్రముఖ వజ్రాల వ్యాపారి. సీ దినేష్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వజ్రాల వ్యాపారం ఆయనకు ఉంది.
జీత్, దియ నిశ్చితార్థానికి సంబంధించి కొన్ని విషయాలే తెలిశాయి. ఎంగెజ్ మెంట్కు సంబంధించి ఒక ఫోటో (photo) మాత్రమే షేర్ చేశారు. వారిద్దరూ సాంప్రదాయ వస్త్రాలు ధరించి కనిపించారు. దియా ఎంబ్రాయిడరీ చేయించిన లెహెంగా (lehenga) ధరించారు. దానిపై పాస్టల్ బ్లూ (blue) దుప్పట్ట వేసుకుని.. అందంగా ఉన్నారు. జీత్ బ్లూ కుర్తా (kurta) వేసుకున్నారు. దానిపైన ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన జాకెట్ (jacket) వేసుకోవడంతో మంచి లుక్ వచ్చింది.
పెన్సిస్ల్వేనియో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లయిడ్ సైన్సెస్లో జీత్ అదానీ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. 2019లో అదానీ గ్రూపులో చేరారు. ప్రస్తుతం ఫైనాన్స్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు.అదానీ గ్రూపు సీఎఫ్వో (cfo) కార్యాలయంలో జీత్ కెరీర్ ప్రారంభించారు. స్ట్రాటజిక్ ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్స్, రిస్క్ అండ్ గవర్నెన్స్ పాలసీ చూస్తుంటారని అదానీ గ్రూపు వెబ్ సైట్లో రాసి ఉంది. అదానీ ఎయిర్ పోర్టు బిజినెస్తోపాటు డిజిటల్ ల్యాబ్స్ కూడా చూస్తుంటారని పేర్కొంది.