27 KG Gold And 15 KG Silver Seized At Miyapur
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర శుక్రవారం రూ.76 వేల మార్కును దాటేసింది. నిన్న రూ. 76,141గా ఉన్న దాని ధర శనివారం నాటికి 141 తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్ ప్రారంభ సమయానికి పసిడి ధర రూ. 76,000గా ఉంది.
చదవండి : తెలంగాణలో భారీగా బీర్ల అమ్మకాలు! ఆల్‌టైం రికార్డ్
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.76,000గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
చదవండి : గుజరాత్లో బయట పడ్డ అతిపెద్ద పాము అవశేషాలు
దేశీయ మార్కెట్లలో భారీగా పెరిగి రూ.86 వేల మార్కును దాటేసిన కిలో వెండి ధర(Silver Rate)లు ఆ తర్వాత కాస్త తగ్గినట్లు కనిపించాయి. అయితే మళ్లీ శనివారం అప్‌ట్రెండ్‌లో ఉన్నాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ.85,860 ఉండగా శనివారం మళ్లీ రూ.314 పెరిగింది. దీంతో నేడు వెండి ధరలు మళ్లీ రూ.86వేల పైకి చేరాయి. రూ.86,174గా నమోదయ్యాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పసిడి ధర 2,392 డాలర్లుగా, ఔన్స్ సిల్వర్ ధర 28.70 డాలర్లుగా ఉన్నాయి.

