Gold Rates Today : స్వల్పంగా పెరిగిన వెండి, బంగారం ధరలు
గత వారమంతా అప్‌ట్రెండ్‌లో నడిచిన బంగారం, వెండి ధరలు, ఈ వారం ప్రారంభంలో మాత్రం స్వల్పంగా తగ్గినట్లు కనిపించి ఊరించాయి. మంగళవారం మళ్లీ ధరలు స్వల్పంగా పెరగడం మొదలుకావడంతో పెరుగుదల ఇంకా తగ్గలేదనే అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వెల్లడవుతున్నాయి.
Huge gold are recovered at vijayawada railway station
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర సోమవారం రూ.67,790 ఉండగా మంగళవారం నాటికి రూ.67 పెరిగి రూ.67,857కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.67,857గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) సోమవారంరూ.74,639 ఉండగా, మంగళవారం నాటికి రూ.355 పెరిగింది. దీంతో ప్రస్తుతం దీని ధర రూ.74,994కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, సిల్వర్ ధరలు మంగళవారం దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2179 డాలర్లు ఉండగా మంగళవారం ఒక డాలరు తగ్గి 2178 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 24.45 డాలర్లుగా ఉంది.