సత్యసాయి: పరిగి మండలంలోని కొడిగెనహళ్లి గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ నరేంద్ర తెలిపారు. 5వ తరగతి, ఇంటర్లో చేరాలనుకునే విద్యార్థులు ఈనెల 31లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 24న నిర్వహించే ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు.