దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో నిర్మించడానికి గూగుల్‌తో భాగస్వామ్యం కావడం తమకు గర్వంగా ఉందని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఇది భారత్‌కు ముఖ్యమైన రోజు అని సంస్థ అధినేత గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ఈ సెంటర్లో ఆరోగ్యం, వ్యవసాయం, ఆర్థిక రంగాల్లో AI ద్వారా కొత్త పరిష్కారాలు త్వరగా వచ్చేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.