పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలను రుణాల ద్వారా తీసుకుని ఎగ్గొట్టి బెల్జియంకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని పోలీసులు అరెస్ట్ చేశారు. తను అరెస్టుని బెల్జియం కోర్టులో సవాల్ చేయగా.. న్యాయస్థానం తిరస్కరించింది. బెయిల్ విషయమై తాజాగా మరోసారి కోర్టును ఆశ్రయించగా నిరాశే ఎదురైంది. మరోవైపు సదరు వ్యాపారీని స్వదేశానికి తీసుకువచ్చేందుకు CBI బృందం చర్యలు చేపట్టింది.