టాటా గ్రూప్ నుంచి మరో ఐపీఓ రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోనే టాటా క్యాపిటల్‌ను ఐపీఓకి తీసుకురానున్నట్లు పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ ఐపీఓ ద్వారా రూ.15 వేల కోట్లు సమీకరించనున్నట్లు సమాచారం. టాటా టెక్నాలజీస్ బంపర్ లిస్టింగ్ తర్వాత ఈ గ్రూప్ నుంచి రానున్న మరో సంస్థ ఇదే కావటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ ఐపీఓపై మదుపర్లలో ఆసక్తి నెలకొంది.