»14 Yr Old Maleesha Kharwas Rise From Mumbai Slums To Luxury Brand Model
Maleesha Kharwa: బురదలోని తామరపువ్వు.. లగ్జరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా స్లమ్ గర్ల్..!
అన్ని కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ లను పెట్టుకుంటారు . దాని కోసం దాదాపు అందరూ సెలబ్రెటీలనే ఎంచుకుంటారు. వారు అయితే, తమ కంపెనీకి పేరు వస్తుందని వారు భావిస్తుంటారు.. అయితే ఇప్పుడు 'ది యువతీ కలెక్షన్' అనే లగ్జరీ బ్రాండ్ ఇప్పుడు మురికివాడలో పెరిగిన ఓ అమ్మాయికి మోడల్‌గా మారే అవకాశాన్ని కల్పించింది. 14 ఏళ్ల బాలే అందులో విజయం సాధించింది. ఆమె మలిషా ఖర్వా, ఒక లగ్జరీ బ్యూటీ బ్రాండ్ కోసం ఎన్నికైన బాలిక.
2020లో మలీషా ముంబైలో హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్మన్ దృష్టిలో పడింది. ఆ తర్వాత ఆ అమ్మాయి కోసం గో ఫండ్ మీ పేరుతో ఫండ్ రైజింగ్ పేజీని ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ 14 ఏళ్ల మలీషాకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తరచుగా తన పోస్ట్‌లకు #princessfromtheslum అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడిస్తుంది. ఇటీవల, మలీషా చాలా ఉత్పత్తులకు మోడలింగ్ చేసింది. ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించింది.
ఇప్పుడు ఆమె ఫారెస్ట్ ఎసెన్షియల్స్ కొత్త క్యాంపెయిన్ ‘యువతి సెలక్షన్’కి అంబాసిడర్‌గా ఉంది. ఇది యువకులను సాధికారత కలిగించే లక్ష్యంతో రూపొందించబడింది. ఏప్రిల్‌లో, బ్రాండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మలీషా ఖర్వా నటించిన వీడియోను షేర్ చేసింది. మలీషా తన మోడలింగ్ ఫోటోలతో స్టోర్‌లోకి ప్రవేశించినట్లు చూపిస్తుంది. వీడియోలో మలీషా నవ్వుతున్న ముఖం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కలలు నిజంగా నిజమవుతాయని మలీషా కథ ఒక అందమైన సాక్ష్యం.
ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. 5 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. 4 లక్షల మందికి పైగా తమ అభినందనలు తెలిపారు. మలీషాపై పలువురు ప్రశంసలు కురిపించారు. ఆమె విజయాన్ని ఆస్వాదిస్తున్నందుకు ఆనందంగా ఉందని,భవిష్యత్తులో ఆమెకు మరింత అదృష్టం లభించాలంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం విశేషం. అందరూ ఆమెకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తుండటం విశేషం.