TG: రాష్ట్రంలో మార్చి రెండోవారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఈరోజు 6 జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. 27 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఎండల తీవ్రత నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి, ప్రజలకు సూచించింది.