కర్నూలు: జిల్లాలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. మహిళా పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలకు ప్రశంసా పత్రాలు అందచేసి సన్మానించాలని సూచించారు.