TG: సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరేందుకు 45,357 దరఖాస్తులు రాగా.. ఈనెల 15న జరిగిన జేసీ సెట్‌కు 39,052 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి విడతలో 18,401 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు జూన్ 7లోపు కాలేజీల్లో చేరాలని మంత్రి తెలిపారు.