»Young Boy Marries Both Sisters At A Time In Telangana
Sattibabu నువ్వు తోపువి సామి.. అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు
సంప్రదాయం ప్రకారం సహజీవనం ఇద్దరితో చేయడంతో అక్కాచెల్లెళ్లను సత్తిబాబు పెళ్లి (Marriage) చేసుకోవాలని నిర్ణయించారు. కుటుంబసభ్యుల కోరిక మేరకు సత్తిబాబు స్వప్న, సునీతలను బుధవారం పెళ్లి చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో వారి పెళ్లి ఘనంగా జరిగింది. ఇద్దరి మెడలో సత్తిబాబు తాళి కడుతుంటే తోటి స్నేహితులు కేరింతలో ఉత్సాహపరిచారు.
ఒకే మండపం.. ఇద్దరు యువతులు.. వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు (Sisters). కానీ పెళ్లి కొడుకు (Bridegroom) మాత్రం ఒక్కడే. ఒకే ముహూర్తం (Muhurtham)లో ఇద్దరి మెడలో మూడు ముళ్లు ఈ పెళ్లి తెలంగాణ (Telangana)లోని కొత్తగూడెం జిల్లాలో జరిగింది. వారం రోజుల నుంచి ఈ పెళ్లిపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. వీరి పెళ్లిని దగ్గరుండి కుటుంబసభ్యులు, కుల పెద్దలు చేయడం విశేషం. ఇది వారి సంప్రదాయ ఆచారం కావడం గమనార్హం. కాగా అతడి వివాహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ((Bhadradri Kothagudem District) చర్ల (Cherla) మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి సత్తిబాబు. అతడు కోయ గిరిజన జాతికి చెందిన యువకుడు. ఈ కులంలో ఒక ఆచారం ఉంది. యువతీయువకులు ప్రేమించుకుంటే పెళ్లికి ముందు కొన్నాళ్లు సహ జీవనం (Dating) చేయాల్సి ఉంది. సహజీవనం అనంతరం వారి పెళ్లి జరగాలి. ఈ క్రమంలోనే సత్తిబాబు స్వప్న అనే అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామని భావించి ఇంట్లో వారికి చెప్పగా సంప్రదాయం (Tradition) ప్రకారం కొన్నాళ్లు ఇద్దరు సహజీవనం చేయాలని చెప్పారు. దీంతో అతడు స్వప్నతో సహజీవనం చేశాడు. ఆ క్రమంలోనే అతడు స్వప్న సోదరి సునీతతో కూడా ప్రేమలో పడ్డాడు. అయితే పెద్ద కుమార్తెను పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులు కోరగా.. తాను ఇద్దరిని ప్రేమిస్తున్నానని చెప్పి వారికి షాకిచ్చాడు.
ఆ యువతులు కూడా సత్తిబాబునే ఇష్టపడుతున్నట్లు చెప్పారు. కాగా అప్పటికే స్వప్నకు ఓ బాబు కూడా పుట్టాడు. దీంతో కుల పెద్దలు సమావేశమై ఏం చేయాలో సమాలోచనలు చేశారు. సంప్రదాయం ప్రకారం సహజీవనం ఇద్దరితో చేయడంతో అక్కాచెల్లెళ్లను సత్తిబాబు పెళ్లి (Marriage) చేసుకోవాలని నిర్ణయించారు. కుటుంబసభ్యుల కోరిక మేరకు సత్తిబాబు స్వప్న, సునీతలను బుధవారం పెళ్లి చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో వారి పెళ్లి ఘనంగా జరిగింది. ఇద్దరి మెడలో సత్తిబాబు తాళి కడుతుంటే తోటి స్నేహితులు కేరింతలో ఉత్సాహపరిచారు.
కాగా సత్తిబాబు పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నువ్వు తోపు సామివి అని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు మాకు కూడా అలాంటి సంప్రదాయం ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరేమో ‘మేం ఒక్కరినే భరించలేకపోతున్నాం.. నువ్వు ఇద్దరిని పెళ్లి చేసుకుని ఏం జేస్తావో’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక బ్రహ్మాచారులు మాత్రం ‘మాకు ఒకరికే దిక్కులేదు. నువ్వేంటి బ్రో రెండేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నావు’ అని బాధపడుతున్నారు.