swimming: ఆ స్విమ్మింగ్ పూల్స్ వద్ద టాప్‌లెస్‌గా ఈతకు అనుమతి
బెర్లిన్(berlin)లోని పబ్లిక్ కొలనుల వద్ద ఉన్న ఈతగాళ్లందరూ త్వరలో టాప్‌లెస్‌గా ఈత కొట్టడానికి అనుమతించబడతారని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే ఓ మహిళ టాప్‌లెస్‌గా స్నానం చేసేందుకు రాగా..అక్కడి నిర్వహకులు ఆమెను అలా చేయోద్దని తిరిగి పంపించారు. దీంతో ఆమె మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని సెనేట్ అంబుడ్స్పర్సన్ కార్యాలయంలో కంప్లైంట్ చేసింది.
అబ్బాయిలు టాప్‌లెస్‌గా ఓ స్విమ్మింగ్ పూల్‌లో(swimming pool) సన్‌బాత్ చేస్తున్న క్రమంలో ఓ మహిళ(women) కూడా అలాగే చేసేందుకు వచ్చేసింది. అది గమించిన అక్కడి నిర్వహకులు ఆమెను అక్కడి నుంచి వెళ్లాలని ఆమెను పంపించేశారు. మహిళలు పైన బట్టలు లేకుండా అలా ఎలా చేస్తారని వెళ్లిపోమన్నారు. దీంతో ఆవేదన చెందిన ఆమె సెనేట్ అంబుడ్స్పర్సన్ కార్యాలయాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పురుషుల మాదిరిగానే మహిళలు కూడా టాప్‌లెస్‌గా వెళ్లేందుకు అనుమతించాలని ఆమె డిమాండ్ చేసింది.
ఆ క్రమంలో మహిళలు వివక్షకు గురయ్యారని బెర్లిన్(berlin) అధికారులు(officers) అంగీకరించారు. దీంతో బెర్లిన్ కొలనులను సందర్శించే సందర్శకులందరూ ఇప్పుడు టాప్‌లెస్‌గా వెళ్లడానికి అర్హులు అని స్పష్టం చేశారు. ఈ కేసులో అంబుడ్స్‌మన్ ప్రమేయం కారణంగా నగరంలోని పబ్లిక్ పూల్స్(public swimming pool)ను నడుపుతున్న బెర్లిన్ మహిళ బేడర్బెట్రీబ్ వారి దుస్తుల నిబంధనలను కూడా తదనుగుణంగా మార్చి వేశారు.
బెర్లిన్(berlin) మహిళ(women) బాడర్బెట్రీబ్ నిర్ణయాన్ని అంబుడ్స్పర్సన్ కార్యాలయం స్వాగతించింది. ఎందుకంటే ఇది మగ, ఆడ లేదా బైనరీయేతర సహా అందరికీ సమాన హక్కులను ఏర్పరుస్తుందని ప్రకటించారు. ఇది బేడర్బెట్రీబ్లోని సిబ్బందికి చట్టపరమైన ఖచ్చితత్వాన్ని కూడా సృష్టిస్తుందని అక్కడి అధికారులు(officers) చెప్పారు. ఇకపై బహిష్కరణలు లేదా గృహ నిషేధాలు జారీ చేయబడవని వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ విధానాన్ని ఎలా అమలు చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త స్నాన నియమాలు ఎప్పటినుంచి అమలు చేస్తారనే విషయం స్పష్టంగా తెలియలేదు. కానీ ఈ నిర్ణయాన్ని జర్మనీ ఫ్రీ బాడీ కల్చర్ స్వాగతించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
జర్మనీలో ప్రధానంగా అన్ని లింగాలతోపాటు నగ్నత్వం పట్ల రిలాక్స్డ్ వైఖరిని అక్కడి ప్రజలు(people) అవలంభిస్తారు. అయితే మునిసిపల్ స్విమ్మింగ్ పూల్స్(swimming pools) వద్ద కూడా అనుమతించబడుతుందా లేదా అనే దానిపట్ల అక్కడి నిర్వహకులు మహిళను కాదనడంతో అసలు వివాదం ప్రారంభమైంది. అంతేకాదు గత ఏడాది కూడా నార్త్ రైన్-వెస్ట్ఫాలియాలోని సీజెన్ సహా అనేక నగరాలు పబ్లిక్ పూల్స్‌లో టాప్‌లెస్ స్విమ్మింగ్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిసింది. కానీ స్నానాలు చేసే క్రమంలో లైంగిక అవయవాలు కనిపించకుండా కవర్ చేసిన దుస్తులు ధరించాలని అధికారులు స్పష్టం చేశారు.