ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా పోరాడేందుకు టీడీపీ నేత నారా లోకేష్ యువగళం(Nara Lokesh Yuvagalam) పేరు పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంసిరెడ్డిపల్లెలో నారా లోకేష్(Nara Lokesh)ని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.
ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా పోరాడేందుకు టీడీపీ నేత నారా లోకేష్ యువగళం(Nara Lokesh Yuvagalam) పేరు పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంసిరెడ్డిపల్లెలో నారా లోకేష్(Nara Lokesh)ని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మైక్ తీసుకొస్తున్న బాషా అనే వ్యక్తి నుంచి పోలీసులు మైక్ లాక్కున్నారు. అంతేకాకుండా లోకేష్ నిలుచున్న స్టూల్ ను సైతం పోలీసులు లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుకు నారా లోకేష్(Nara Lokesh) స్టూల్ మీదే నిలబడి నిరసన తెలిపారు.
టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర(Nara Lokesh Yuvagalam) 14వ రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్ర ప్రస్తుతం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రారంభమైంది. ఆత్మకూరు ముత్యాలమ్మ గుడి ఆవరణలో లోకేష్‌కు విడిది ఏర్పాటు చేశారు. ఈ విడిది కేంద్రం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించే ముందుగా సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. ప్రతి రోజూ కూడా సుమారు 1000 మందికి క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీలు ఇస్తూ వస్తున్నారు. రోజూ తనను కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి నారా లోకేష్ సెల్ఫీ దిగుతున్నారు. ఆ కార్యక్రమం అయ్యాక నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభిస్తున్నారు.
తాజాగా గురువారం కూడా సెల్ఫీ కార్యక్రమాన్ని ముగించుకుని పాదయాత్రను మొదలు పెట్టారు. అంతకుముందు ఆత్మకూరు ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో నారా లోకేష్(Nara Lokesh) పాల్గొని పూజలు చేశారు. ఆ తర్వాత యువగళం పాదయాత్ర(Nara Lokesh Yuvagalam) ప్రారంభించారు. పాదయాత్రలో పాల్గొంటున్న లోకేష్‌ను ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల ప్రతినిధులు కలిసి తమ సమస్యలను వివరించారు. టిడిపి హయాంలో ప్రైవేట్ విద్యా సంస్థల అనుమతుల పునరుద్దరణ 10 ఏళ్లకు ఒక సారి జరిగేదని, ఇప్పుడు పూర్తిగా మారిపోయిందన్నారు.
ఏపీలో వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత రూల్స్ మారిపోయాయని తెలిపారు. 3 ఏళ్లకు ఒకసారి అనుమతులు రెన్యువల్ చేసుకోవాలనే నిబంధన పెట్టినట్లు గుర్తు చేశారు. ఆ నిబంధన వల్ల ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. పాత పద్దతినే కొనసాగించేలా చర్యలు చేపట్టాలని నారా లోకేష్(Nara Lokesh) ను కోరారు. ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతుల కోసం వేధింపులకు గురిచేస్తున్నారని, ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యుత్ బిల్లుల స్లాబ్ ను 2 నుంచి 7కి మార్చాలని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తెలిపాయి.
నారా లోకేష్(Nara Lokesh) మాట్లాడుతూ..వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జె- ట్యాక్స్ కోసం ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పదేళ్లకోసారి రెన్యువల్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఫైర్ ఎన్ ఓసి, ఇతర సాకులతో జరుగుతున్నటువంటి వేధింపులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ బిల్లుల అంశాన్ని పరిశీలించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు.