Supreme Court hearing on Rahul Gandhi's petition on July 21
Rahul Gandhi: మోడీ ఇంటి పేరు వివాదంలో కాంగ్రెస్(Congress) ముఖ్యనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ పై విచారణ చెపట్టేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ పరువునష్టం(defamation) కేసులో సేషన్స్ కోర్టు రాహుల్ కు విధించిన రెండెళ్ల జైలు శిక్షను నిలిపివేయాలంటూ స్టే పిటిషన్ వేయగా, దాన్ని గుజరాత్(Gujarath) హై కోర్ట్ ఇటీవల కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సర్వోన్నత న్యాయస్తానంలో అపిల్ చేశారు. దీనిపై జులై 21 అపెక్స్ కోర్టు విచారణ చేపట్టనుంది.
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్‌లో మోడీ ఇంటిపేరు కలిగిన వారంత దోచుకునే వారే అనే అర్థం వచ్చేలా మాట్లాడిన రాహుల్ పై ఈ పరువునష్టం కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మార్చిలో తీర్పు ఇచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా రుజువై రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే లోక్‌సభ సచివాలయం రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్ద చేసింది.
దీంతో సెషన్స్ కోర్టు వేసిన శిక్షను నిలిపివేయాలంటూ గుజరాత్ కోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు రాహుల్ పిటిషన్ ను కొట్టేసి శిక్షార్హుడే అని తేల్చిచెప్పింది. దీంతో రాహుల్ అత్యున్నత న్యాయస్థానానంలో గుజరాత్ తీర్పును సవాల్ చేయగా ఆయన పిటిషిన్‌ను జులై 21న విచారించనుంది.