Sunitha Husband Rajashekar reddy:వైఎస్ వివేకానంద (viveka) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య కేసులో భాస్కర్ రెడ్డి (bhaskar), ఉదయ్ కుమార్ రెడ్డి (uday kumar reddy) విచారణ ముగిసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి (rajashekar reddy) సీబీఐ అధికారుల వద్దకు వచ్చారు. ఇటీవల వివేకానంద రెండో భార్య షమీమ్‌ను (shamim) సీబీఐ అధికారులు విచారించారు.
సునీత భర్త, సునీత మరిదిపై ఆరోపణలు చేశారు. ఆస్తి కోసం తెగించారని.. వివేకా పవర్ ఆఫ్ అటార్నీ తీసివేశారని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో వివేకా కుంగిపోయారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు చాలాసార్లు బెదిరించారని షమీమ్ వాంగ్మూలం ఇచ్చారు. షమీమ్ (shamim) స్టేట్ మెంట్ ఇచ్చారో లేదో.. రాజశేఖర్ రెడ్డి (Rajashekar reddy) సీబీఐ కార్యాలయానికి వచ్చారు. ఇదీ కీలక పరిణామంగా మారింది. ఆయన ఏం చెప్పారనే అంశం సస్పెన్స్‌గా మారింది.
వివేకా హత్య కేసులో అవినాష్‌ను సీబీఐ విచారిస్తోంది. ఈ నెల 30వ తేదీ లోపు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐకి సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. దాంతో కేసు విచారణ స్పీడందుకుంది. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది.
సునీత (Sunitha) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద స్టే ఇవ్వాలని కోరగా అంగీకరించింది. అవినాష్‌ను (avinash) సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారని, నిలువరించాలని అతని తరఫు న్యాయవాదులు కోరగా.. సుప్రీంకోర్టు సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని స్పష్టంచేసింది. 24వ తేదీ సోమవారం రోజున సుప్రీంకోర్టులో సునీత (sunitha), అవినాష్ (avinash) తరఫు వాదనలు వినిపించనున్నారు.