YS Avinashకు తెలంగాణ హైకోర్టు షాక్, బెయిల్ అర్జెంట్ అంటూనే.. సీబీఐ విచారణ నో అబ్జెక్షన్
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ తెలంగాణ హైకోర్టులో మరోసారి వాయిదా పడింది. సీబీఐ విచారణ చేసుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.
YS Avinash:మాజీమంత్రి, వైసీపీ నేత వివేకానంద హత్య కేసు తుది దశకు చేరింది. ఈ కేసులో అవినాష్ (YS Avinash) తండ్రి భాస్కర్ రెడ్డి (bhaskar reddy), స్నేహితుడు ఉదయ్‌ను (uday) సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అవినాష్ విశ్వ ప్రయత్నం చేశారు. తెలంగాణ హైకోర్టు (telangana high court) ఈ నెల 25వ తేదీ వరకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టుకు వెళ్లడంతో.. సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. హైకోర్టులో విచారణ జరుపుకోవాలని చెప్పడంతో ముందస్తు బెయిల్‌పై ఆశతో ఉన్నారు. ఈ రోజు కూడా పిటిషన్ విచారణ జరిగినా.. తీర్పు రిజర్వ్ చేశారు.
అవినాష్ (YS Avinash) ముందస్తు బెయిల్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రోజు వాదనల తర్వాత వెకేషన్ బెంచ్ మార్చుకుంటారా అని జడ్జీ సురేంద్ర అడిగారు. అర్జెంట్ అని తీర్పు ఇవ్వాలని సీబీఐ, అవినాష్ తరఫు లాయర్లు కోరారు. మరీ అంత అత్యవసరం అయితే చీఫ్ జస్టిస్ బెంచ్‌కు వెళ్లాలని సూచించారు. రేపటినుంచి హైకోర్టుకు సెలవులు అనే సంగతి తెలిసిందే. వెకేషన్ తర్వాత తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది.
ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పు ఇన్ని రోజులు రిజర్వ్‌లో పెడితే బాగుండదని జడ్జీ సురేంద్ర అన్నారు. కేసు విషయంలో సీబీఐ తన పని తాను చేసుకుపోవాలని సూచించారు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని.. సీబీఐ విచారణ కంటిన్యూ చేయాలని కోరారు. బెయిల్ పిటిషన్ విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివేకా హత్య జరిగింది. హత్య జరిగిన వెంటనే సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించారు. కేసును సీబీఐకి బదిలీ చేయాలని వివేకా కూతురు సునీత కోరడంతో.. సీబీఐకు అప్పగించారు. కేసు విచారణను ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. ఏపీలో ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని ఇక్కడికి మార్చారు. వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో.. పలుమార్లు విచారించిన ధర్మాసనం కేసు విచారణను 2023 ఏప్రిల్ 30వ తేదీ లోపు పూర్తి చేయాలని సీబీఐకి స్పష్టంచేసింది. తర్వాత లాయర్లు కోరడంతో.. జూన్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చింది. సీబీఐ విచారణను స్పీడప్ చేసింది. అవినాష్ అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అవినాష్‌ను విచారిస్తే.. కేసు విచారణ పూర్తి అవుతుందని సీబీఐ చెబుతోంది. అవినాష్ మాత్రం అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. ఆ కేసు విచారణ పూర్తి కావడం లేదు.