Caught On Camera:దేశ రాజధాని ఢిల్లీలో (delhi) పట్ట పగలే దొంగలు రెచ్చిపోయారు. సీలంపూర్‌లో నడిచి వెళ్తున్న ఒకతడిని ఇద్దరు పట్టుకొని మరీ చోరీ చేశారు. ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డైంది. ఆ వీడియోలు (video) బయటకు రావడం.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చక్కర్లు కొడుతున్నాయి.
సీలంపూర్ జీ-బ్లాక్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు రవీందర్ సింగ్ (Ravinder singh) అనే యువకుడిని పట్టపగలే దోచుకున్నారు. వీధిలో నడుస్తోన్న అతడిని మెయిన్ రోడ్డుకు వచ్చే క్రమంలో ఒకడు దాడి చేసి.. కదలకుండా బంధించాడు. పక్కనే గల వరండాపైకి తీసుకెళ్లగా.. మరొకడు వచ్చాడు. జేబుల్లోంచి నగదు, ఇతర వస్తువులను తీసుకొని.. వారిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
యువకుడిని గట్టిగా పట్టుకోవడంతో స్పృహ తప్పి పడిపోయినట్టు తెలుస్తోంది. బాధితుడు చలనం లేకుండా ఉండగా.. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు (police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజీ చూసి నిందితులు నజీమ్, షరాపత్‌గా గుర్తించి.. అరెస్ట్ చేశారు. చోరీ జరిగిన గంటల్లోనే అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు (police) చెబుతున్నారు.ఇద్దరిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. నజీమ్‌కు (nazim) నేర చరిత్ర ఉందని.. గతంలో కూడా అరెస్ట్ అయ్యాడని చెబుతున్నారు.
#WATCH | Delhi: CCTV visuals of a person robbed & assaulted by miscreants in Seelampur (26.04)
Ravinder Singh age 18 years was robbed by two accused Nazim & Harafat near G-Block, Seelampur, Delhi. Both robbers have been apprehended. Case filed under various sections of the IPC… pic.twitter.com/7abRdfM5AA
ఇలాంటి ఘటనే తమిళనాడు తిరిచ్చిలో జరిగింది. ప్రొఫెసర్ సీతాలక్ష్మీని కర్రతో కొట్టి రోడ్డు పక్కకు తీసుకెళ్లి దోపిడీ చేశాడు. ఆమె వద్ద నుంచి మొబైల్ ఫోన్ తీసుకొని.. అక్కడినుంచి పారిపోయాడు.