Mla Raja Singh:గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో హిందుత్వకు బ్రాండ్ అంబాసిడర్ అయిన రాజా సింగ్ (Raja Singh).. త్వరలో పార్టీ మారే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్‌తో (Kasani Gnaneshwar) సమావేశం అయ్యారని విశ్వసనీయంగా తెలిసింది. అన్నీ అంశాలు డిస్కస్ చేశారని.. త్వరలో టీడీపీలో చేరతారని సమాచారం.
తెలంగాణ బీజేపీలో రాజా సింగ్ (Raja Singh) కీలకనేత.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే.. ఆ తర్వాత మహ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్స్, పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేయడంతో బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఎత్తివేస్తారని రాజా సింగ్ (Raja Singh) వెయిట్ చేస్తోన్న ఫలితం లేదు. గత 6 నెలల నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారట.
రాజా సింగ్ (Raja Singh) హిందుత్వకు బ్రాండ్ అంబాసిడర్ అయినప్పటికీ.. ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత బీజేపీలోకి వచ్చి.. ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు సొంతగూటికి వెళతారని తెలుస్తోంది. దీనికి సంబంధించి 2 రోజుల్లో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
గోషామహల్ నియోజకవర్గంతోపాటు మరో 3 చోట్ల టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పూర్తి సహకారం అందిస్తానని రాజా సింగ్ (Raja Singh) చెప్పినట్టు తెలిసింది. దీనికి సంబంధించి జాతీయ నాయకత్వంతో చర్చించి.. ఆహ్వానించేలా ఏర్పాట్లు చేస్తానని రాజాసింగ్‌కు (Raja Singh) చెప్పారట.
రాజా సింగ్ (Raja Singh) 2009లో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. 2014 వరకు కార్పొరేటర్‌గా పనిచేశారు. 2014లో బీజేపీలో చేరి గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో వరసగా రెండోసారి విజయం సాధించారు. గోషా మహల్ బీజేపీ టికెట్‌ను విక్రమ్ గౌడ్‌కు (vikram goud) ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటు సస్పెన్షన్ ఎత్తివేయకపోవడం.. మరో వైపు టికెట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి.. దీంతో రాజా సింగ్ (Raja Singh) పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.