కడప: పాత బస్టాండ్ వద్ద ఉన్న యాదాళ్ల పిచ్చయ్య చారిటీ స్థలంలో అనుమతి లేకుండా కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోందని, దీనిని వెంటనే ఆపాలని సీపీఐ కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలు కోర్టు స్టేను అడ్డుపెట్టుకుని అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని, జడ్పీ స్థలాల ఆక్రమణ, మీసేవ భవనంలో క్యాంప్ ఆఫీసు ఏర్పాటును సీపీఐ వ్యతిరేకిస్తోందన్నారు.