కడప: బద్వేల్ పట్టణంలోని చెన్నంపల్లి గ్రామంలో శనివారం రాత్రి ఒంటిగంటకు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక కారు దగ్ధమైంది. కారు యజమాని అనురాధ సమాచారం అందించడంతో బద్వేల్ ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ. మూడు లక్షల యాభై వేలు నష్టం జరిగినట్లు అంచనా వేశారు.