YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నేరస్థుడు కాదు, మీడియాపై సజ్జల ఆగ్రహాం
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నేరస్థుడు కాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. విచారణకు రావాలని పిలిస్తే హాజరవుతున్నారని పేర్కొన్నారు.
YS Avinash Reddy:మాజీమంత్రి వైఎస్ వివేకానం (YS Viveka) హత్య కేసులో విచారణకు హాజరుకావాలని ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ పిలువగా.. అమ్మకు బాగోలేదని కడప బయల్దేరిన సంగతి తెలిసిందే. సీబీఐ అధికారులు ఓ వైపు.. మరోవైపు మీడియా ప్రతినిధులు ఫాలో అయ్యారు. ఈ ఇష్యూపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పందించారు.
వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) విచారణకు సహకరిస్తున్నారని తెలిపారు. తల్లికి బాగోలేదని.. సీబీఐకి సమాచారం ఇచ్చి బయల్దేరారని వివరించారు. ఈ రోజు కాకున్నా.. రేపు అయినా విచారణకు వెళతారని తెలిపారు. ఈ కేసులో అవినాష్ (YS Avinash) నేరస్థుడు కాదని.. ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. ఆయనకు తప్పించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అవినాష్‌ను (YS Avinash) మీడియా వెంబడించడాన్ని తప్పుపట్టారు. తల్లికి బాలేదని విచారణకు డుమ్మా కొట్టే వ్యక్తి అవినాష్ కాదని చెప్పారు. వైఎస్ ఫ్యామిలీ అలాంటిది కాదన్నారు. వివేకాను హత్య చేశానని చెబుతోన్న వ్యక్తి కార్లలో తిరుగుతూ.. ప్రెస్ మీట్లు పెడుతుంటే.. ఎంపీని వెంటాడుతున్నారని సజ్జల (sajjala) మండిపడ్డారు.
వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబం పాత్ర ఉందని చిన్న ఆధారం దొరికినా అప్పటి సీఎం చంద్రబాబు వదిలిపెట్టేవారా అని సజ్జల ప్రశ్నించారు. ఏ ఆధారం లేదని.. ఆరోపణలు వచ్చాయని, విచారణకు రావాలని కోరితే హాజరవుతున్నారని పేర్కొన్నారు.