»Anganwadis Do Not Join Their Duties The Jobs Will Be Lost Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy: విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు పోయినట్లే
ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. పది రోజుల్లో విధుల్లో చేరకపోతే వారి ఉద్యోగాలు కోల్పొతారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Anganwadis do not join their duties, the jobs will be lost.. Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి ఉద్యోగస్తుల సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం అవడంతో సమ్మెను ఉదృతం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) స్పందించారు. నోటీసుల్లో తెలిపినట్లు 10 రోజుల్లో విధుల్లో చేరకపోతే అంగన్వాడీల ఉద్యోగాలు పోయినట్లే అని ఆయన పేర్కొన్నారు. కొత్త నియామకాలను చేపట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీన్ని తెగేంతవరకూ లాగొద్దని హెచ్చిరించారు. సమ్మె ఎల్లకాలం కుదరదు. రాజకీయ పార్టీలతో కలిసి ఈ సమ్మెచేస్తున్నారని పేర్కొన్నారు.
అంగన్వాడీల(Anganwadis )తో ప్రభుత్వ చర్చలు విఫలమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సమ్మె చేయగానే డిమాండ్లు నెరువేరుతాయంటే ఉద్యోగులందరూ సమ్మె చేస్తారని వెల్లడించారు. ఒక రాష్ట్రాన్ని నడిపే ప్రభుత్వం ఒక హామీ ఇవ్వాలంటే ఆశామాశి కాదని, ఏ మాత్రం ఆలోచించకుంటా సమ్మె చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. ఇలాగే సమ్మె కొనసాగితే ఇప్పటివరకు ఇచ్చిన డిమాండ్లు కూడా వెనక్కి తీసుకునే అవకాశం ఉందన్నారు. 2024 జులైలో వేతనాలు పెంచుతామని చెప్పాం. మినిట్స్‌లో నమోదు చేస్తామని హామీ ఇచ్చాం.వారితో చర్చల్లో పదవీవిరమణ ప్రయోజనాలను అంగన్వాడీ కార్యకర్తలకు రూ.50వేల నుంచి రూ.70వేలకు, ఆయాలకు రూ.20వేల నుంచి రూ.50వేలకు పెంచుతామని చెప్పాం. మట్టిఖర్చుల కింద రూ.20వేలు చెల్లిస్తామన్నాం. యాప్‌ల నిర్వహణ సలహాలు తీసుకుంటామని.. జనాభా ప్రాతిపదికగా మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తామన్నాం’’ అని ఆయన తెలిపారు.