»Arvind Kejriwal Delhi Cm Summoned By Ed For The Fourth Time
Arvind Kejriwal: ఢిల్లీ సీఎంకు నాలుగోసారి ఈడీ సమన్లు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికీ మూడుసార్లు నోటీసులు జారీ చేశారు.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికీ మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. జనవరి 18న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. ఈసారి అయిన విచారణణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ సమన్లు చట్టపరమైనవి కావని.. కేవలం తనను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా జారీ చేశారని కేజ్రీవాల్ కొట్టిపారేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 2023 ఫిబ్రవరి నుంచి జైల్లోనే ఉన్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను అక్టోబర్‌లో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు అనేకమంది పార్టీ నేతలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈక్రమంలో ఈడీ కేజ్రీవాల్‌కు మొదటి సమన్లు జారీ చేసినప్పటి నుంచి ఆయన్ను అరెస్ట్ చేస్తుందన్న ఊహాగానాలు ఎక్కువైపోయాయి.