BDK: ఇల్లందు మండలంలోని పోచారం గ్రామంలో తుపాను వలన నష్ట పోయిన మిర్చి, వరి, పత్తి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అఖిల భారత రైతుకులి సంఘం మండల ప్రధాన కార్యదర్శి మూడు మాలు, న్యూడెమోక్రసీ మండల సహాయ కార్యదర్శి మోతిలాల్ డిమాండ్ చేసారు. AIKMS మండల ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో కొమరారం, పోచారం, బోయి తండాలలో నష్ట పోయిన పంట పొలాలను పరిశీలించారు.