Guntur Karam: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన తాజా మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie). ఓవర్సిస్లో మహేష్ బాబుకు విపరీతమైన క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. కేవలం ప్రీమియర్స్ షోలతో 1.4 మిలియన్ డాలర్స్‌ను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా నిన్న విడులైన ఈ చిత్రం సిటీలలో బాగా ఆడింది. అలాగే నైజాం, సీడెడ్ లతో పోలిస్తే ఆంధ్రలో ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది. చిత్రంలో స్టార్స్, టెక్సిషియన్స్ రెమ్యూనరేషన్స్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారు 200 కోట్ల రూపాయల బడ్జెట్ దాటింది. అయితే ప్రపంచవ్యాప్తంగా 132 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 135 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంది.
సినిమా టాక్ కొంచం మిక్సుడ్ గా ఉన్నా తొలిరోజు ప్రీ బుకింగ్స్ సాలిడ్ గా ఉండటం సినిమాకి హెల్ప్ అయింది. ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే సినిమా 32-34 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా సినిమా 43-45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. అంటే 60-70 కోట్ల గ్రాస్ వసుళ్లు చేసిందని ట్రెడ్ పండితుల అంచనా. ముఖ్యంగా ఫ్యాన్స్ కన్నా ఫ్యామిలీ ఆడియన్స్‌కు సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ వీకెండ్ లోపు 100 కోట్లు వసుళ్ చేసే అవకాశం ఉంది. కానీ లాంగ్ రన్లో సినిమా ఎంత సంపాదిస్తోందో చూడాలి.