మొన్న బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్కుకు బర్త్ డే చేస్తూ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఎన్టీఆర్ పోస్ట్ పై కాస్త లేట్‌గా రియాక్డ్ అయ్యాడు హృతిక్ రోషన్. కానీ హృతిక్ ఇచ్చిన సాలిడ్ రిప్లై అదిరిపోయింది.
Hrithik Roshan: అసలు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమా వస్తుందని ఎవ్వరు ఊహించలేదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వార్ 2 సినిమా నిలవబోతోంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను పవర్ ఫుల్‌గా డిజైన్ చేసినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. త్వరలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు తారక్. ఇది కంప్లీట్ అవగానే వార్2 షూటింగ్లో జాయిన్ అవనున్నాడు.
ఇదిలా ఉంటే.. జనవరి 10న హృతిక్ రోషన్ బర్త్ డే కావడంతో.. హ్యాపీ బర్త్ డే హృతిక్ సర్, బిగ్ చీర్స్ టు ఫైటర్.. అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. ఈ ట్వీట్‌తో వార్ 2 టాగ్ టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కానీ ఎన్టీఆర్ పోస్ట్‌కు హృతిక్ నుంచి కాస్త లేటుగా రిప్లై వచ్చింది. కానీ అది సాలిడ్‌గా ఉండడంతో వైరల్‌గా మారింది. Happy Birthday @iHrithik sir… Wishing you an amazing one and a year full of good vibes. Big cheers to Fighter! అని ఎన్టీఆర్ పోస్ట్ చేయగా.. Thank you so much @tarak9999 ! Loved Devara glimpse. Good luck & see you soon .. అంటూ హృతిక్ రిప్లై ఇచ్చాడు. ‘థాంక్యూ సో మచ్ తారక్.. దేవర గ్లింప్స్ నచ్చింది. గుడ్ లుక్.. సీ యు సూన్’ అంటూ హృతిక్ రోషన్ రిప్లైని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. దీంతో మరోసారి వార్ 2 ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.