Hanuman: హనుమాన్’ దెబ్బ.. మళ్లీ ‘ఆదిపురుష్’ను ఆడేసుకుంటున్నారుగా!
ఓ పెద్ద సినిమా ఆదిపురుష్, ఓ చిన్న సినిమా హనుమాన్.. అసలు ఈ రెండు సినిమాల బడ్జెట్‌కు సంబంధమే లేదు. కానీ అవుట్ పుట్ విషయంలో మాత్రం కంపారిజన్స్ ఉన్నాయి. దీంతో మరోసారి ఆదిపురుష్‌ను ఆడేసుకుంటున్నారు.
Hanuman: ఆదిపురుష్ వర్సెస్ హనుమాన్.. ఇప్పుడెందుకు ఈ రచ్చ అనుకుంటున్నారా? కానీ నెటిజన్స్ వదిలేలా లేరుగా. హనుమాన్ సినిమాను ఆదిపురుష్‌తో పోల్చడం టీజర్‌తోనే మొదలైంది. ఆదిపురుష్ టీజర్ వచ్చిన తర్వాత హనుమాన్ టీజర్ బయటకు వచ్చింది. ఈ రెండు టీజర్లలోని గ్రాఫిక్స్ చూశాక.. ఆదిపురుష్ పై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది. దాన్నే నిజం చేస్తూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది ఆదిపురుష్. ఐదారు వందల కోట్ల బడ్జెట్ ఇస్తే సినిమాను ఇంత దారుణంగా తీస్తావా? ప్రభాస్ క్రేజ్‌ను వాడుకోలేకపోయాడు.. అంటూ దర్శకుడు ఓం రౌత్‌కు చుక్కలు చూపించారు.
ఇక ఇప్పుడు హనుమాన్ రిలీజ్ అవడం, సినిమాకు హిట్ టాక్ రావడం, గ్రాఫిక్స్ విషయంలో బడ్జెట్‌కు మించిన అవుట్ పుట్ ఉండడంతో.. మరోసారి ఆదిపురుష్ డైరెక్టర్‌ను ఆడుకుంటున్నారు. హనుమాన్ సినిమాకు మేకర్స్ ఖర్చు పెట్టింది మహా అయితే.. 20 కోట్లకు అటు ఇటుగా ఉంటుంది. కానీ అవుట్ పుట్ మాత్రం వంద కోట్లకు పైగా ఉంది. ఇంత తక్కువ బడ్జెట్‌తో అంత క్వాలిటీని ఎలా రాబట్టాడో.. ఓం రౌత్ తెలుసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా అంటే ఇలా తీయాలి.. ఆదిపురుష్ సినిమాను ప్రశాంత్ వర్మ తీయాల్సిందని ట్రోల్స్ చేస్తున్నారు.
హనుమాన్ సినిమా చూసిన తెలుగు ఆడియెన్స్.. అసలు ఆదిపురుష్‌తో పోలికే వద్దంటున్నారు. ఆ ఎలివేషన్స్, బీజీఎమ్, క్లైమాక్స్ అదిరిపోయాయని, సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా.. అంటూ హనుమాన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. కానీ హనుమాన్ మాత్రం.. ఆదిపురుష్ కలెక్షన్స్‌ను బీట్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఏదేమైనా.. ఓం రౌత్‌ని మాత్రం మరోసారి ఆడేసుకుంటున్నారు.