Kalki: సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు దాదాపు మూడు వారాల పాటు థియేటర్లో సలార్ సినిమాతో సందడి చేసిన ప్రభాస్.. ఇప్పుడు డబుల్ ధమాకాకు రెడీ అవుతున్నారు. బాహుబలి తర్వాత సలార్ చిత్రంతో అభిమానుల దాహం తీర్చేసిన ప్రభాస్.. నెక్స్ట్ సినిమాలతో ఇదే జోష్ని కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. నెక్స్ట్ ప్రభాస్ నుంచి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి రిలీజ్‌కు రెడీ అవుతోంది. లేటెస్ట్గా మే 9న కల్కి రిలీజ్ కానుందని అనౌన్స్ చేశారు. అయితే కల్కి రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు టీజర్ రిలీజ్ కూడా ఉంటుందని అనుకున్నారు.
ఇది కూడా చూడండి: Captain Miller: ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ టాక్.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్!
ఇప్పటికే టీజర్ కట్ చేశారని, ఒక నిమిషం 23 సెకన్లతో రెడీ చేశారని తెలిసింది. కానీ కల్కి టీజర్ లేకుండానే రిలీజ్ డేట్ ప్రకటించారు. దీంతో టీజర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే అదే రోజు మారుతి సినిమా నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశాడు మారుతి. సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో ప్రభాస్ ప్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: hanuman: జై హనుమాన్.. సీక్వెల్ మామూలుగా ఉండదు!
ఇక ఎలాగు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా అనౌన్స్ అయిన కల్కి నుంచి టీజర్ బయటికొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు కాబట్టి.. ఈ సంక్రాంతికి ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ డోస్ అనే చెప్పాలి. సలార్ తర్వాత ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఆరు నెలల్లోపే ప్రభాస్ నుంచి కల్కి రానుంది కాబట్టి.. ఇప్పటి నుంచి కల్కి టైం స్టార్ట్ అయినట్టే. ఆ తర్వాత మారుతి సినిమా సందడి స్టార్ట్ కానుంది. ఈ రెండు సినిమాలు కూడా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: KTR: అలా మాట్లాడడం తప్పు.. బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ హితబోధ

