»Hanuman Jai Hanuman The Sequel Will Not Be Ordinary
hanuman: జై హనుమాన్.. సీక్వెల్ మామూలుగా ఉండదు!
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ మూవీ.. ఓ చిన్న సినిమాగా మొదలై ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. హనుమాన్ సినిమాకు అదిరిపోయే హిట్ టాక్ రావడంతో.. సీక్వెల్ హైప్ మామూలుగా లేదు.
hanuman: అసలు హనుమాన్ సినిమాకు పెట్టిన ఖర్చుకు, జరిగిన బిజినెస్‌కు సంబంధమే లేకుండా.. ఓ పెద్ద సినిమా రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు పోటీగా జనవరి 12న హనుమాన్ రిలీజ్ అయింది. అయితే.. ఓ రోజు ముందే ప్రీమియర్స్ షోస్ వేసి సినిమా హైప్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లారు మేకర్స్. ఈ ప్రీమియర్స్‌కు సాలిడ్ హిట్ టాక్ రావడంతో హనుమాన్ హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. ఒక్క తెలుగులోనే కాదు.. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ సినిమా దుమ్ముదులిపేసేలా ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్ అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ టైటిల్‌తో సీక్వెల్ రానుంది. 2025లో జై హనుమాను వస్తుందని మూవీ ఎండ్‌లో రివీల్ చేశాడు ప్రశాంత్ నీల్. ఇదే సమయంలో.. హనుమంతుడు రాముడికి ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటి? అంటూ క్యూరియాసిటీ పెంచేశాడు. గతంలో బాహుబలి విషయంలో.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అంటూ ఒకే ఒక్క ఒక్క ప్రశ్నతో బాహుబలి పార్ట్ 2 పై భారీ హైప్ క్రియేట్ చేశాడు రాజమౌళి. ఇక ఇప్పుడు హనుమాన్ విషయంలోను అదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న అప్పట్లో ఎంతలా ఫేమస్ అయ్యిందో.. ఇప్పుడు రాముడికి హనుమంతుడికి ఇచ్చిన మాట ఏంటి? అనేది అంతే పాపులర్ అవుతుందని అంటున్నారు. ఇదే జరిగితే హనుమాన్ సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోనున్నాయి. ఇక సినిమా హిట్ అయింది కాబట్టి.. హనుమంతుడి పాత్రలో స్టార్ హీరోని తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. అదే జరిగితే.. జై హనుమాన్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది.