»Guntur Kaaram Mahesh Babus Fans Are Burning After Watching The Movie
Guntur Kaaram: సినిమా చూసిన మహేష్ బాబు.. మండిపోతున్న ఫ్యాన్స్!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చేసింది. అయితే ఈ సినిమాను మహేష్ బాబు కూడా అభిమానులతో కలిసి చూశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Guntur Kaaram: సంక్రాంతి సీజన్‌ని టార్గెట్ చేస్తూ జనవరి 12న గుంటూరు కారం సినిమా ప్రేక్షకలు ముందుకి వచ్చింది. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాను అభిమానులు, ఫ్యామిలీ మరియు త్రివిక్రమ్‌తో కలిసి హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో సినిమాను చూశాడు మహేష్ బాబు. తమ అభిమాన హీరోతో సినిమా చూడడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వినిపిస్తోంది.
వన్ మ్యాన్ షోగా మహేష్ బాబు అదరగొట్టాడని అంటున్నారు.. గురూజీ డైరెక్షన్, కథ, కథనం బాగాలేదని అంటున్నారు. అసలు థియేటర్లో త్రివిక్రమ్ కనిపిస్తే మామూలుగా ఉండదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అజ్ఙాతవాసి సినిమాను కూడా ట్రెండ్ చేస్తున్నారు. దీంతో పాటు గురూజీని కూడా ట్రెండ్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా రిజల్ట్‌ను ఇప్పుడే చెప్పలేమంటున్నారు. కానీ డే వన్ మాత్రం భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏదేమైనా.. త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమతో డిజప్పాయింట్ చేశాడనే మహేష్ బాబు మండిపడుతున్నారు.
ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల మెయిన్ హీరోయిన్గా నటించగా.. మీనాక్షి చౌదరి కీ రోల్ ప్లే చేసింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని హారిక హాసని బ్యానర్ పై నిర్మాచిరు. రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరి రావు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.