KNR: జనవరి 26 నుంచి ఫిబ్రవరి 4 వరకు జేఎస్ఎస్ అకాడమీ మైసూరులో జరగనున్న దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయ క్రికెట్ కోసం శాతవాహన విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన SU VC ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో క్రీడాకారులు తమ శారీరక ధృడత్వంతో శ్రమించి సత్తా చాటాలని అన్నారు.