»A Dead Old Man Who Was Being Taken In An Ambulance In Haryana Came Back To Life
Viral News: అంబులెన్స్ కుదపుతో.. చనిపోయిన వృద్దుడు బతికాడు
ఓ వ్యక్తి చనిపోయాడు అని నిర్ధారించుకొని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తున్నారు. దారిలో అంబులెన్స్ గుంటలో పడింది. ఈ కుదుపుతో చనిపోయిన వ్యక్తి తిరిగి బతికాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
A dead old man who was being taken in an ambulance in Haryana came back to life
Viral News: ఆసుపత్రిలో మృతి చెందిన ఓ వృద్దున్ని అంత్యక్రియల కోసం అంబులెన్స్‌లో తరలిస్తుండగా అతను తిరగి బతికాడు. హర్యానా(Haryana)లో చోటుచేసుకున్న ఈ ఘటనలో బతికొచ్చిన వ్యక్తి పేరు దర్శన్‌సింగ్ బ్రార్(80). ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అతనికి గుండె సమస్య కూడా ఉంది. చికిత్స పొందుతున్న దర్శన్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించడంతో పాటియాలా నుంచి కర్నాల్‌లోని తమ ఇంటికి అంబులెన్సులో తరలిస్తుండగా.. అంబులెన్స్ గుంతలోపడింది. దాంతో మృతదేహంలో కదలికలు కనిపించడాన్ని తోడుగా ఉన్న దర్శన్ మనవడు చూశాడు. తరువాత గుండె కొట్టుకోవడం గమనించి డ్రైవర్‌కు చెప్పాడు. దీంతో సమీపంలోని ఆసుపత్రికి అంబులెన్స్‌ను తరలించారు. దర్శన్‌ను పరీక్షించిన వైద్యులు అతడు బతికే ఉన్నట్టు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
దర్శన్ చనిపోయినట్టు తాము చెప్పలేదని అంతకుముందు ఆయన చికిత్స పొందిన రేవల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ నేత్రపాల్ వెల్లడించారు. అతడిని తమ వద్దకు తీసుకొచ్చినప్పుడు శ్వాస తీసుకుంటున్నాడని, బీపీతో బాధపడుతున్నాడని తెలిపారు. మరో ఆసుపత్రిలో ఏం జరిగిందన్న విషయం తమకు తెలియదని, బహుశా టెక్నికల్ ఎర్రర్ కానీ, ఇంకేదైనా సమస్య కానీ ఉండొచ్చు అని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ వృద్ధిడి పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్స్ చెబుతున్నారు.