HYD: మానసిక వికలాంగులను తల్లిదండ్రులే భారంగా భావించే నేటి పరిస్థితుల్లో వారిని చేరదీసి కోలుకునేలా సేవలందించడం నిజంగా అభినందనీయమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ అన్నారు. మోతీ నగర్ బబ్బుగూడలోని జ్ఞానమాస్ మానసిక వికలాంగుల పాఠశాలలో దాతలు ఏర్పాటుచేసిన ఆట వస్తువుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రమేష్ హాజరై ప్రారంభించారు.