కోనసీమ: అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామపంచాయతీ పరిధిలోని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల్లో సర్పంచ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం సూపర్ క్లోరినేషన్ చేశారు. తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు తాగునీటి కాలుష్యంతో వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టామని పంచాయతీ అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ శశికళ గురువారం ట్యాంక్లో ఉన్న మంచినీటిని పరిశీలించారు.