KMR: కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో గురువారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో గోపాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోమాతకు పూజలు చేశారు. భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు శామాయి ఆనందరావు మాట్లాడుతూ.. గోవు విశిష్టత, ప్రాముఖ్యతను తెలిపారు. సనాతన సంప్రదాయ బద్దంగా వస్తున్న ఆచారాలను, గోవుల వల్ల కలిగే లాభాలను వివరించారు.