VZM: కొత్తవలస మండలం రాజపాత్రునిపాలెం గ్రామం ఎస్. సి కాలనీలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కాలువలో పూడికలు పేరుకుపోయాయి. మురుగునీరు రోడ్డు మీదకు రావడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించి విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను పారిశుధ్య సిబ్బందితో దగ్గర ఉండి పూడికలను తీసివేశారు.