SRPT: గుర్రంపోడు జీపీ భవన నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. 8 సంవత్సరాల క్రితం నిధులు మంజూరైనప్పటికీ స్లాబ్ వరకు కట్టి అర్ధాంతరంగా వదిలేశారని గ్రామస్థులు ఆరోపించారు. అధికారులు, నాయకుల నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి తలెత్తిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ధనాన్ని వృథా చేయకుండా ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.