E.G: రాజానగరం మండలం కొండ గుంటూరు గ్రామంలో తుఫాను కారణంగా నష్టపోయిన రైతన్నలను గురువారం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో కలిసి తుఫానుకు నీట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించారు. రైతులెవరు అధైర్య పడవద్దు అని నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వం తరఫున పంట నష్టం పరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.