WGL: మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల రాయపర్తి మండలంలో నీట మునిగిన వరి, పత్తి పంటలను ఎంసీపీఐ (యు) జిల్లా నాయకుడు గుగులోతు అరుణ్ నాయక్, గురువారం పరిశీలించారు. మండలంలోని జయరామ్ తండాలో సుమారు 100 ఎకరాల వరి పంట నష్టపోయిందని, ప్రభుత్వం ఎకరాకు రూ.40 వేల నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలన్నారు.