VZM : ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు తుఫాన్ నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారన్నారు. ఈ మేరకు ఎక్కడ ప్రాణనష్టం, ఆస్తి నష్టం కానీ జరగలేదన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.